మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని
పలు ప్రాంతాలకు చెందిన పలువురు ముస్లింలు బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శాలువాలతో సత్కరించి రంజాన్ ప్రత్యేక వంటకం షీర్ కుర్మాను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బేగంపేట డివిజన్ పాటిగడ్డ బస్తీ అధ్యక్షుడు శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అక్బర్, నసీం భాను, విజయలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో ఓల్డ్ కస్టమ్స్ బస్తీకి చెందిన ఆరిఫ్, సాబీర్ అలీ, నవాబ్, అశ్వక్, అజీజ్, సనత్ నగర్ కు చెందిన నోమాన్, సికిందర్, ఉస్మాన్, ఫహీం తదితరులు ఉన్నారు.


