ప్రకాశం జిల్లా, పిసి పల్లి మండలం, దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విచ్చేసిన సందర్భంగా హెలిప్యాడ్ ఏరియా వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మర్యాద పూర్వకంగా కలిశారు. తదుపరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మరియు సభకు మంత్రి పాల్గొని తిరిగి బయలుదేరారు. ముందుగా హెలిప్యాడ్, వి.ఐ.పి రూట్, బందోబస్తు, సభా వేదిక, డ్రోన్ కెమెరాలతో చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, పార్కింగ్ ప్రదేశాలను మరియు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లు చేసి మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించడమైనది. బందోబస్తుల పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.






