శ్రీహర్షిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు దివిస్ కంపెనీ వారి ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలలో 3.16 లక్షల ప్యాకేజీ తో మొత్తం 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా డిగ్రీతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ను కూడా నిర్వహిస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీ హర్షిణి అని తెలియజేశారు. దీనికి కారణం కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుండి కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా డిగ్రీ చేరిన విద్యార్థికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కు కావలసిన అర్థమెటిక్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ మొదటి సంవత్సరం నుండి డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నేర్పించడం జరుగుతుంద ని తెలియజేశారు.ఎంపిక కాబడిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు , పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, ఏవో ర్యాంకర్ శ్రీనివాసరావు, క్యాంపస్ ఇంచార్జ్ ధిరీష్ పవిత్ర క్యాంపస్ ఇన్చార్జి ప్రతాప్, శంకర్ మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
