ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం లోని దివాకరపల్లిలో బుధవారం సి బి జి ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్శిలో అన్నా క్యాంటీన్ కు రూ. 61 లక్షలు నిధులు మంజూరు చేస్తూ.... నగర కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం పట్ల డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దర్శి లో అన్నా క్యాంటీన్ కోసం డాక్టర్ లక్ష్మి అనేకసార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ని అనేక సార్లు కలిసి విన్నవించారు. ఈ మేరకు అన్న క్యాంటీన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయడం హర్షణీయం అన్నారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గం కురిచేడు ప్రాంతంలో సిపిజి ప్లాంట్ ను కూడా మంజూరు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , నారా లోకేష్ ని, విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ ని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆమె వివరించారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీ కి అవసరమైన శాశ్వత భవనాల ను నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని లోకేష్ ని కోరడం ఆయన దానిపై కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆమె వివరించారు. ఇలా కూటమి ప్రభుత్వంలో 10 నెలల్లో ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంగా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మంత్రి లోకేష్ ఇస్తున్న సంపూర్ణ సహకారానికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ నియోజకవర్గాలు ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ,జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.




