చంద్ర శేఖర పురం పోలీస్ స్టేషన్ ను
ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీస్ క్వార్టర్స్, పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు.
పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే పిర్యదుదారులకు పరిష్కారం అందించాలని, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విధుల వంటి వాటిపై ఆరాతీసి పలు సూచనలు తెలియచేసారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ…. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. శక్తి యాప్, సైబర్ క్రైమ్, డయల్ 112 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు.
సియస్ పురం పరిధిలోని భైరవ కోనలోని శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్ధానము జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ముందుగా సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
వెంట డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పామూరు సీఐ భీమా నాయక్, సియస్ పురం పురం ఎస్సై సుమన్ మరియు సిబ్బంది ఉన్నారు.







