పామూరు సర్కిల్ ఆఫీస్ మరియు స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీస్ క్వార్టర్స్, పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకొని, పనితీరు ఇంకా మెరుగు పరుచుకోవాలని సూచించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమాలపై పామూరు నగరంలోని ఆటో డ్రైవర్స్ మరియు యజమానులకు బుధవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్ పి అవగాహన కల్పించి వారికి పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్ల ట్రాఫిక్ పరమైన సమస్యలు, అదేవిధంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్లు రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ అవగాహనతో ఉండి రోడ్డు ట్రాఫిక్ సంజ్ఞలను పాటించాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, మన మీద కుటుంబం ఆధారపడి ఉంటుందని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఆటో డ్రైవరు రహదారి భద్రత నియమాలు పాటించాలి. రహదారి భద్రత మనందరి భాద్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా ఇతర చట్టవ్యతిరేక/అసాంఘిక పనులకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రక్షణ కవచంలా హెల్మెట్ ఉంటుందని, తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందన్నారు. హెల్మెట్ ధరించటం ద్వారా మీ భద్రత మరియు మీ కుటుంబం యొక్క ఆనందం గురించి ఆలోచించాలన్నారు. వారి కుటుంబసభ్యులు బైక్ మీద వెళ్లేటప్పుడు రహదారి భద్రత నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పాలని జిల్లా ఎస్పీ సూచించారు.
మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, డ్రగ్స్, గంజాయి మరియు తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు. శక్తి యాప్ గురించి తెలియచేయాలని, గ్రామాలలో సిసి కెమెరాల యొక్క ప్రాముఖ్యత గురించి ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
వేసవి కాలం ఆరంభమై ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు, పట్టణ ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహం తీర్చేందుకు పామూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
ప్రారంభించారు. అదేవిధంగా శక్తి టీం మరియు బ్లూ కోట్స్ కు ద్విచక్ర వాహనములను ప్రారంభించారు.
పామూరు గోల్డ్ మర్చంట్ అసోషియషన్, కాలేజీ యాజమాన్యం మరియు హాస్పిటల్ వారు సీసీ కెమెరాలను పామూరు పట్టణంలో ఏర్పాటు చేయుటకు అందచేశారు. పోలీస్ సిబ్బందికి విజయ్ మొబైల్ షాప్ వారు హెల్మెట్ లను అందచేశారు. జిల్లా ఎస్పీ వారిని అభినందించారు.
జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పామూరు సీఐ భీమా నాయక్, సియస్ పురం పురం ఎస్సై సుమన్ మరియు సిబ్బంది ఉన్నారు.







