ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు పేద ప్రజలకు గూడు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు పేర్కోన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో గురువారం గృహా నిర్మాణ శాఖ అధికారులు తాళ్లూరు, ముండ్లమూరు మండలాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ హౌసింగ్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ… స్థానిక నాయకులకు నివాసాల మంజూరు, పెండింగ్ వివరాలు తెలిపి వారి సహకారంతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ బాధ్యతగా పనిచేసి పురోగతి తీసుకురావాలని కోరారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ…. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం లేక పోతే పురోగతి సాధ్యం కాదని అన్నారు. జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ…. ఆగిన గృహా నిర్మాణాల పురోగతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే రాష్ట్రంలో రూ.300 కోట్లు అందులో జిల్లాకు 5 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. వాటితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అదనగా రూ.50వేలు, 75వేలు, లక్ష రూపాయల చొప్పున పురోగతిని బట్టి నిధులు మంజూరు చేస్తారని తెలిపారు. మే నెల 3వ తేది నాటికి జిల్లాలో 8,839 నివాసాలు పూర్తి చెయ్యాల్సి ఉండగా ఇప్పటి వరకు 2620 నివాసాలు పూర్తి అయ్యాయని చెప్పారు.నిథులు ఉన్నాయి కనుక పని పూర్తి అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలను నగదు జమ అవుతుందని చెప్పారు. విషయాన్ని లబ్దిదారులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తెలిపి ప్రొత్సహించి నివాసం పూర్తి చేసుకునేలా చూడాలని కోరారు. జీవితంలో సహాయం చేసిన ఉద్యోగిని లబ్దిదారులు మరిచి పోరని అందుకు తాను ఎఈగా ఉన్న సమమయంలో నివాసాలు మంజూరు చేసి సహకరించిన నాకు పలు చోట్ల అకస్మాత్తుగా కలసి కృతజ్ఞతలు తెలుపుతారని చెప్పారు. చిత్త శుద్ధితో పనిచేసి లబ్ధిదారులతో కలసి ఒక గ్రూపును తయారు చేసి పురోగతిని ప్రతి రోజు తెలిపాలని కోరారు. నూతనంగా మంజూరు అయిన గృహాలకు పీఎం ఆవాస్ యోజనలో ముందస్తుగానే పోజిషల్ సర్టిఫికేట్ ఇతర పత్రాలు యాప్లో అప్లోడ్ చెయ్యాల్సి ఉందని తెలిపారు. అలా చేస్తేనే గృహాం మంజూరు అవుతుందని అవి కూడ త్వరలో వస్తాయని చెప్పారు. తాళ్లూరు మండలంలో నూతనంగా 435 మంజూరు అయ్యాయని తెలిపారు. ఎంపీడీఓ దార హనుమంత రావు మాట్లాడుతూ గృహా నిర్మాణ శాఖ నుండి ఎటువంటి పురోగతి విషయాలు తనకు తెలియటం లేదని విషయాలను తెలిపటంతో వారు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ఇకపై పురోగతి సాధించేందుకు తగిన ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. ఎఈ హనుమంత రావు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిథులకు, అధికారులకు తెలిపాలని ఇకపై ఎటువంటి లోపం లేకుండా చూస్తానని చెప్పారు. అనంతరం పీడీ శ్రీనివాస ప్రసాద్ ను ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి వలి, కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యం లు సన్మానించారు.

