గుర్తు తెలియని వృద్ధురాలు మృతిచెందిన ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత సోమవారం ఉదయం 7.30గంటల సమయంలో ముఖంపై ఘాయం, తలకు కట్టుతో టివోలి సమీపంలో అపస్మారక స్థితిలో స్థితిలో ఉన్న 60ఏళ్ల వయసున్న మహిళను పోలీసులు గుర్తించి వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యాచకురాలై ఉంటుందని, ఆమెను గుర్తించిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ ఆర్ జయచందర్ తెలిపారు.
