బేగంపేట ఏప్రిల్ 4 (జేఎస్ డి ఎం న్యూస్):
ఈ నెల 6 వ తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రారండి అంటూ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాలు అందాయి. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో సనత్ నగర్ లోని హనుమాన్ దేవాలయ పండితులు కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా జెక్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు సుబ్బరాజు, సురేష్ గౌడ్ లు తమ కాలనీలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అదేవిధంగా మోండా డివిజన్ లోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం లో నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఈ. ఓ అన్నారావు ఆధ్వర్యంలో ఆహ్వానించారు.
