ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచి అధిక ఆదాయం పొందేలా కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లాలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలపై దృష్టి సారించి ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచేలా తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులతో సమావేశమై ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ శాఖల్లో వృద్ది రేటు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచేలా తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతుల్లో కూడా ఈ విషయాలపై అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. డ్రోన్ వినియోగం ముందు డ్రోన్ వినియోగం తరువాత ఎంత పంట దిగుబడి వచ్చిందో వ్యవసాయ అధికారులు సమగ్రంగా పరిశీలన చేసి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంలో ప్రకృతి వ్యవసాయం అవలంభించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్దికి మంచి అవకాశం ఉందని, అందుకనుగుణంగా ఉద్యాన శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రోటెన్షియల్ ఏరియాను గుర్తించి ఉద్యాన పంటల అభివృద్ధి పై రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో సుక్ష్మ సేద్యం విధానాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాల ఉత్పత్తి పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం పాడి పశువుల పై కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది, తదితర విషయాలను సమగ్రంగా విశ్లేషణ చేసి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సదుపాయాలపై కూడా నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జెడి డా. బేబి రాణి, ఆర్టికల్చర్ అధికారి గోపి చంద్, ఏపీ ఎంఐపి పిడి రమణ, ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *