కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని ఆపార్టీ సంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ దర్శినియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి శుక్రవారం కలిసారు. పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషిని వివరించారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని తిరునాళ్లకు ఆహ్వాన పత్రికను అందించారు. పలు సమస్యలపై చర్చించినట్లు కైపు క్రిష్ణా రెడ్డి తెలిపారు.


