తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో మోసపోవద్దు- క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండండి -ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు – క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు-క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాలకు మేరకు ఒంగోలు టౌన్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం ముఖ్య ప్రదేశాలలో ఆర్టీసీ బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు మరియు ఇతర ప్రదేశాలలో 15 పోలీస్ బృందాలగా ఏర్పడి ఆన్లైన్ బెట్టింగ్ లకు ఆడే వారిని గుర్తించుటకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా క్రికెట్ బెట్టింగ్ కు సంభందించిన పలు యాప్స్ ను గుంపులగా ఉన్న ప్రదేశలలో వారి యొక్క మొబైల్ ఫోన్ లలో తనిఖీ చేయటం జరిగింది. ఎవరైనా IPL ఆన్లైన్ బెట్టింగులు గాని ఆడుతూ ఉన్నట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని పోలీస్ అధికారులు తెలియచేసారు. ఈ తనిఖీలలో భాగంగా క్రికెట్ బెట్టింగ్ కు సంభందించిన పలు యాప్స్ ను సుమారు 1000 మంది పైగా తనిఖీ చేయటం జరిగింది. వారిలో 18 మంది వ్యక్తుల యొక్క ఫోన్ లలో అనుమానాస్పద యాప్స్ గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ ….ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోవద్దని ప్రజలు, యువతకు ఒంగోలు డిఎస్పీ సూచించారు. ప్రజలందరూ క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలి కానీ బెట్టింగ్ మాయలో పడకూడదన్నారు. మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ ఆటగాడు ఎంత స్కోరు చేస్తాడో, ఏ బౌలర్ వికెట్లు తీయగలడో అంటూ చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్, చివరకు అన్నీ కోల్పోయే స్థాయికి తీసుకెళ్తుందన్నారు.

గతంలో బెట్టింగ్ లకు పాల్పడే వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామని, ఆన్ లైన్/ ఆఫ్లైను ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనుక ఎవరూ కూడా కష్టపడకుండా వచ్చే నగదుకు ఆశపడి బెట్టింగ్ రాయుళ్ల చేతుల్లో చిక్కుకోవద్దని, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఒంగోలు డిఎస్పీ సూచించారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ తనిఖీలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *