భారత స్వాతంత్య్రం అనంతరం నాలుగు దశాబ్దాలకు పైగా దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి కాంగ్రెస్ మరియు వామపక్ష ధోరణులతో కమ్యూనిస్టు పార్టీల పోకడలలో జాతి యావత్తు హిందుత్వ భావనలు కోల్పోయి, సాంస్కృతిక విలువలు తగ్గిపోయి నిర్వీర్యమై ఉన్న భారతావనిలో భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం తో ప్రజల మనస్సుల్లో హిందూ సాంసృతిక వైభవ పునరుజ్జీవనం, శక్తివంతమైన, సౌభాగ్యవంతమైన దేశంగా, ప్రపంచాన అగ్రగామిగ నిలుస్తుందనే ఆకాంక్షకు రూపం వస్తుందనే అశ చిగురించింది. బిజేపి రాజకీయాలలో మొదట నిలదొక్కుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో జతకట్టినా తమలో హైందవ భావజాలం ద్విగుణీకృతమౌతూ ద్యోతకమౌతూ ఈ 45 సంవత్సరాల కాలంలో దేశంలో అత్యంత పెద్ద రాజకీయ శక్తిగ ఎదిగి దేశ పాలన వగ్గాలు చేపట్టి దేశ రక్షణ, హిందూ ధర్మాల బలోపేతం కోసం పాటుపడునూ ప్రపంచపటంలో అతి దుర్భేద్యమైన సైనిక పటాలం, దృఢమైన ప్రధాని, వారి అనుయాయులు కలిగిన గొప్ప భారతదేశంగా నిలచి ఉన్నదనడంలో అతిశయోక్తి లేదని ప్రకాశంజిల్లా భాజపా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు అభిప్రాయపడ్డారు.
1980లో బిజేపి అవిర్భావమునకు మునుపు, తరువాతగా భారతదేశ చరిత్రను గమనిస్తే ఆ తేడా స్పష్టముగా తెలుస్తుందని అన్నారు. 18కోట్ల కార్యకర్తలు, సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కొనసాగుచున్నదని, ఏడు దేశాలతో తప్ప మిగతా దేశాలలోని జనాభా భాజపా సభ్యులకంటే తక్కువగా ఉన్నదని, అసేతు హిమాచలం 31 రాష్ట్రాలలో 19 ఇంట భాజపా ముందున్నదని, 2014 లో 252 లోక్ సభ . స్థానాలు 2019 లో 303, లోక్ సభ స్థానాలను 2024 లో 293 కూటమిగా ఏర్పడి ప్రభుత్వమును ఏర్పాటు చేయడం. బిజేపికి ఇచ్చారని, భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ ఏ లక్ష్యాలను, అజెండాలు దేశరక్షణ, సంప్రదాయ హిందూ ధర్మాల బలోపేతములను కలిగి ఉన్నాయో నేడు కూడా భాజపా అవే లక్ష్యాలను కలిగి, మాట తప్పకుండా ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగ నిలవడానికి, దేశాభివృద్ధికి భారతీయులందరూ సంఘటితంగా, సమైక్యంగా, భాషలు ప్రాంతాలు వేరైనా భారతీయులందరూ ఒక్కటే అని దేశాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకొని వెళ్లడానికి మోదీ నాయకత్వంలోని భాజపా కృషి చేస్తు ఉన్నదని తెలిపారు. దేశంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్ రావాలనే లక్ష్యంతో జన సంఘ్ ఏర్పండిందని, వానిని కొనసాగిస్తూ భాజపా ముందుగు సాగుతు ఉన్నదని, ఆర్టికల్ 370 ని రద్దు చేసిందని, అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టిందని, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వక్హ్ బోర్డు సవరణలను దిగ్విజయంగా పూర్తి చేసిందని, ‘సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్’ భావనను కలిగి, విలక్షణ మైన, విశిష్టమైన పార్టీ అని, అవినీతికి తావులేని పార్టీగా అటల్ బిహారి వాజ్పేయి, మోదీ నాయకత్వంలో భాజప పరిపాలిస్తుందని,
ప్రపంచంలో ఆర్థికంగా ఐదో స్థానంలో ఉన్న మనం అగ్రస్థానానికి చేర్చడానికి భాఖపా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రపంచదేశాలకు మార్గదర్శనంగా దేశాన్ని మోడీ తీర్చిదిద్దారని, ఉక్రెయిన్ రష్యాలకు మధ్యవర్తిత్వం చేయమని ఆయా దేశాలు కోరుచున్నాయని, ప్రపంచదేశాల్లో భారతీయులు గర్వంగా ధైర్యంగా నిలదొక్కునేలా భాజన ప్రభుత్వం పురోగమిస్తుందని, భవిష్యత్ లో మరింతగా అభివృద్ధి సాధించడం కోసం భాజప కు అందరూ సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కోట్లరూపాయలను ఇస్తుంది. కనుక ఈ కూటమి పాలనకు మద్దతునిస్తున్న భారతీయ జనతా పార్టీకి సంపూర్ణు సహకారం అందిస్తే రాష్ట్రం సంపూర్ణమైన అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. భారత 15వ ప్రధానిగా 26వ తేది మే 2014న ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దేశరక్షణకు, అభివృద్ధికి, ప్రజా జీవన సమతుల్యతకు పలు పథకాల ద్వారా కాపాడటం, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఇరుగు పొరుగు దేశాలకు ఆక్సిజన్, మందులు, ఆహారపదార్థాలు, టీకాలు అందించడం ఇలా ఎన్నోరకాలుగా ఆదుకోవడం జరిగినది. యూనిఫాం సివిల్ కోడ్, పౌరసత్వం సవరణ, జాతీయ పౌర జాబితా తయారు ద్వారా మతమార్పిడులను రూపుమాపడం, తద్వారా దేశంలో శాంతి భద్రతలు కాపాడటం వంటివి కార్యాచరణ చేయడం, అంతర్గత దేశ భద్రతను కాపాడటంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన చేసిందని తెలిపారు. రైతుపట్టాలు, నోట్లరద్దు తదితర అంశాలపై అవగాహన లోపంతో కొందరు అదేపనిగ చేస్తున్న విమర్శలను నిజమనుకొని ప్రజలు కాస్త ఆసంతృప్తికి లోనవడం జరిగినదని, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ అగ్రగామిగా భారత్ నిలవడం శాస్త్రవేత్తలను వెన్ను తట్టి ప్రోత్సహించడం ఒక బీజేపీకే సాధ్యమైనదని ప్రకాశం జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 6. బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు..
