హైదరాబాద్ ఏప్రిల్ 5 (జె ఎస్ డి ఎం న్యూస్):
కన్నా నువ్వు తల ఎత్తు కొని జీవించాలి.మన కుటుంబం పేరు నిలబెట్టాలి అంటూ తల్లి తండ్రులు తమ పిల్లలకు చెపుతుంటారు.అయితే నగరం లోని చాంద్రాయణ గుట్ట షాహిన్ నగర్ కు చెందిన అమీన్ అన్సారి కి అదే ఎత్తు తిప్పలు తెచ్చి పెడుతుంది.తండ్రి కాచి గూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు.ఆయన అనారోగ్యంతో 2021లో మరణించారు.కారుణ్య నియామకం కింద ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అన్సారీకి మెహదీపట్నం డిపోలో కండక్టర్గా ఉద్యోగం ఇచ్చారు. అయితే అన్సారి ఏడు అడుగుల పొడవు ఉండటంతో ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహించడం మారింది. బస్సులో రోజు ఐదు ట్రిప్పులు 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది (195 సెంటీమీటర్లు 6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే అన్సారీకి బస్సులో విధులు నిర్వర్తించడం కష్టతరంగా మారింది. దీంతో అతనికి వెన్నునొప్పి మెడ నొప్పి తో పాటు నిద్రలేమిటో ఆస్పత్రిలో చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్సారి వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి అతనికి ఆర్టీసీలో నే మరి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారు.
