సికింద్రాబాద్ ఏప్రిల్ 5 (జె ఎస్ డి ఎం న్యూస్) :
సామాజిక న్యాయమే బాబూ జగ్జీవన్ రామ్ ఆశయమని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పడి నవీన్ కుమార్ మాదిగ అన్నారు. బాబు జాగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలలో జగ్జీవన్ విగ్రహాలకు నవీన్ కుమార్ మాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్థానిక మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ముఖ్యంగా ఇండియా – పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర జ్యోతి,లలిత, విజయలక్ష్మి,శ్వేత ,సంగీత ,ప్రవళిక ,మనీష్, మనోజ్ ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

