బేగంపేట ఏప్రిల్ 5 (జే ఎస్ డి ఎం న్యూస్) :
గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త బాబు జగ్జీవన్ రామ్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట, బేగంపేట డివిజన్ లలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని నివాళులు అర్పించారు.
ఐడిహెచ్ కాలనీలో…
బన్సీలాల్ పేట డివిజన్ లోని ఐ డి హెచ్ కాలనీలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేషన్ రాజు, నాయకులు గజ్జెల శ్రీనివాస్, దక్షిణామూర్తి, శివ, వినోద్, సురేష్, మల్లేష్, ప్రదీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
*జబ్బార్ కాంప్లెక్స్ …..*
బన్సీలాల్ పేట డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, నిర్వహకులు సుదర్శన్ బాబు, మహేందర్, ప్రేమ్, మహేందర్, అశోక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పాటిగడ్డ లో…..
బేగంపేట డివిజన్ లోని పాటిగడ్డలో గల ఎన్ బి టి నగర్ లో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్, అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, నిర్వహకులు మత్స్యగిరి, బస్వప్ప, నారాయణ, రాములు, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.


