మహిళల రక్షణ కోసం పోలీసులు ఇప్పటికే షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. తాజాగా పురుషుల రక్షణ కోసం హి టీమ్స్ ఏర్పాటు చేయాలని నినాదం కొత్తగా తెరపైకి వచ్చింది. మహిళల కు భద్రత కల్పించేలా షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లుగానే పురుషుల భద్రత కోసం హి టీమ్స్ ఏర్పాటు చేయాలంటూ శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కొందరు యువకులు రికార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్ జె శేఖర్ బాషా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
