కంటోన్మెంట్ ఏప్రిల్ 5 (జేయస్ డి ఎం న్యూస్):
బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్భంగా అన్నానగర్ చౌరస్తా లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడని, అలాగే దేశంలో దళితుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంఘసంస్కర్త అన్నారు.
సాధారణ దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారని, 50 ఏళ్ల పాటు చట్ట సభలో ఉండి 30 ఏళ్లకు పైగా క్యాబినెట్ మినిస్టర్ గా ఉండి ఆయన దేశానికి చేసిన సేవ మరువలేనిదని అన్నారు. తెలంగాణ లోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తుందని అన్నారు. ఎన్నడూ ఎవరూ చేయలేని విధంగా చరిత్రలో నిలిచిపోయే ఎస్సీ వర్గీకరణను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమం కోసమే 13 శాతానికి పైగా 40.2 వేల కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

