దెందులూరు,ఎప్రిల్ 05: (జె ఎస్ డి ఎం న్యూస్):
ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించేదే రామరాజ్యమని, అటువంటి రామరాజ్యమే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో గల దాదాపు 500 రామాలయాల్లో జరగనున్న శ్రీరామ నవమి వేడుకల కోసం పానకం తయారీ కోసం మొత్తం ఎనిమిది టన్నుల బెల్లాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనకాపల్లి నుంచి ప్రత్యేకంగా తెప్పించి శనివారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా కేటాయించిన ఆటోలు, జీపులు, కార్లు వాహనాలలో బెల్లం ఆయా గ్రామాలోని రామాలయాలకు అందించే విధంగా స్థానిక కూటమి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. ప్రతి రామాలయానికి 15 కేజీల బెల్లపు కుందె ఇవ్వాలని, భక్తులు ఎక్కువగా ఉండే ఆలయాలకు అదనపు బెల్లపు కుందె లు కూడా ఇవ్వాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమి నాయకులకు సూచించారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసిపి పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలు తొలగిపోయి జీవితాల్లో ఆనందాలు తిరిగి పొందుతున్నారు అని, వాటిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు పండగలు కూడా ఎంతో ఆనందంగా, ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరు నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


