తాళ్లూరు మండల కేంద్రంలోని సరస్వతి హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన టి టెన్ టెన్నిన్ బాల్ అసోషియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన పోటీలలో అండర్ -17 విభాగంలో పదవ తరగతి విద్యార్ధి తిరుపతి రెడ్డి, అండర్ -14 విభాగంలో 8వ తరగతి కి చెందిన కె కార్తిక్ రెడ్ది, ఎం కార్తీక్, 9వ తరగతికి చెందిన పి సంతోష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ఎంపిక కావటం పట్ల సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ మూర్తి, పీఈటి బిజ్జం వికాన్ విద్యార్థులను అభినందించారు.
