తాళ్లూరు మండలంలోని పలుగ్రామాల్లో దివంగత నేతమాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతివేడుకలు శనివారం ఘనంగాజరిగాయి. తాళ్లూరు ఎస్సీకాలనీలో ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అనపర్తి ఆదామ్ మాదిగ్ ఆద్వర్యం లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదామ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ అవిరళ కృషి చేశారని, అట్టడుగు జాతిలో జన్మించి, మేధస్సుతో దేశ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచారని కొనియాడారు. అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తని తెలిపారు. టీడీపీ ఎస్సీనెల్ మాజీ అధ్యక్షులు అనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ విద్యతో ఉన్నత స్థానంలో నిలిచి దేశ ఉపప్రధానిగా దేశాభివృద్ధికి బాటలు వేశారని ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకునిముందుకు సాగాలన్నారు. ముందుగా జగ్జీవన్ రామ్ ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాలులు అ ర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, అనపర్తి సత్యవ ర్ధన్, శీమోన్, ప్రకాశరావు, నాగేశ్వరరావు, బాలకోటయ్య, తదితరులు పాల్గొన్నారు.
