తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరుకు గత రెండు రోజులుగా సాగర్ తాగు నీరు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. మండల కార్యాలయాల పరధిలో ఉన్న ప్రధాన ట్యాంకులో సైతం చుక్క నీరు లేక పోవటంతో ప్రజలు కార్యాలయాల వద్దకు తాగు నీటి కోసం వచ్చి వెనుదిరుగు తున్నారు. మండుతున్న ఎండలకు తోడు తాగు నీరు రాక పోవటంతో సాగర్ నీరు అలవాటు అయిన ప్రజలు మినరల్ వాటర్ తాగ లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. గత నెలలో కూడ మూడు రోజుల పాటు నీరు లేక ఇబ్బందులు పడ్డారు. తరచూ ఇలా తాగు నీరు రాక పోవటం ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగు నీటి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
