నియోజక వర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందేలా నియోజక వర్గ స్థాయి విజన్ ప్లాన్ ను రూపొందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు.
సోమవారం ఒంగోలులోని ఎన్జిఓ హోమ్ లో స్వర్ణాంద్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా నియోజక వర్గాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పన మరియు ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఏర్పాటుచేసిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ స్వర్ణాంద్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయుటకు అవసరమైన శిక్షణ ఇచ్చుటకు ఈ రోజు వర్క్ షాప్ ను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఒక నియోజకవర్గం లో రానున్న సంవత్సరాల కాలంలో ఏ సెక్టార్ లో అభివృద్ధి, వృద్ది రేటు ఎలా ఉంటుంది, వాటిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజక వర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంద్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పది సూత్రాలను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకుని అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలతో పాటు ప్రైమరీ, సెకండరీ, సర్వీస్ తదితర వివిధ సెక్టార్ల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. నియోజక వర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందేలా నియోజక వర్గ స్థాయి ప్రణాళికలను రూపొందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ వర్క్ షాప్ లో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సిపిఓలు వెంకటేశ్వర రావు, రఘురామయ్య, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సలహాదారు సీతాపతి, రెండు జిల్లాలకు చెందిన నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, సివిఎపి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

