కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని సోమవారం విజయవాడలో రాష్ట్ర అసంఘటిత కార్మికుల చైర్మన్, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యల గురించి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలను నగదు చెల్లింపు జాప్యం గురించి, మున్సిపల్ కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గురించి, రైతులకు గిట్టుబాటు ధరలు లేక విల విల లాడుతున్న విషయాలను గురించి వివరించారు. గంజాయి, లిక్కర్ మాఫియా గురించి తెలిపినట్లు చెప్పారు. మహిళల మీద, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫ్ల్యూరెన్స్ ఆవశ్యకత గురించి చెప్పారు. దర్శి నియోజక వర్గంలో ఉన్న పలు సమస్యల గురించి చెప్పారు. దర్శి నియోజక వర్గంలో ఇసుక, మట్టిమాఫియా గురించి వివరించినట్లు చెప్పారు.



