తాళ్లూరు మండల మహిళా సమాఖ్య సమావేశం స్థానిక వెలుగు కార్యాలయంలో సోమవారం ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఎపీఎం దేవరాజ్ మాట్లాడుతూ పొదుపు సంఘ మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి మరింత మొత్తంలో రుణాలు పొందాలని కోరారు. పీఎం ఎఫ్ ఎం ఈ, పీఎం ఈ జీపి, షేడ్ నెట్ పలు పథకాల గురించి వివరించారు. సీసీ లు సుచేంద్ర, సిబ్బంది కుమారి తదితరులు పాల్గొన్నారు.
