వి.హెచ్.పి మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మే 25న హనుమాన్ శోభాయాత్ర – కరపత్రాలను, క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల.

సమాజం బాగుకోసం విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అనుసరణీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే దామచర్ల కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ కార్యకర్తలు శాసనసభ్యులు జనార్దన్ రావుని కలిసి మే 25వ తేదీ ఆదివారం మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా దామచర్ల బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను మరియు రిజిస్ట్రేషన్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం మరియు గతంలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో తాను పాల్గొన్నట్లు తెలుపుతూ సేవా, సురక్ష, సంస్కార్ లను సమాజానికి అందిస్తూ దేశభక్తిని ప్రతి ఒక్కరిలో నిలపడానికి పలు విధాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడినారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనుటకు క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. దామచర్ల జనార్దన్ రావు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి తమ పేరుని తొలిగా నమోదు చేసుకున్నారు.

దామచర్లను కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి ఇనమనమెల్లూరి సీతారామయ్య, బజరంగ్దళ్ విభాగ్ కార్యదర్శి యక్కిటీల పిచ్చయ్య చౌదరి, ఒంగోలు జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, మఠంపల్లి దుర్గాఆదిశేషు, అంకిరెడ్డి, రాజేష్ వర్మ, వెన్నెల సుబ్బారావు, సుదర్శన్, రామకోటి రెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *