ప్రకాశం నగర్ మెయిన్ రోడ్డు వద్ద 28 సంవత్సరాలుగా మర్రి చెన్నారెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం..చలివేంద్రాన్ని ఏర్పాటుచేసిన సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్.చలివేంద్రాన్ని ప్రారంభించిన మర్రి రవీంద్రారెడ్డి.

బేగంపేట ఏప్రిల్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
వేసవిలో పాదచారులు ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి దాహార్తిని తీర్చేందుకు 28 సంవత్సరాలుగా బేగంపేట ప్రకాశం నగర్ మెయిన్ రోడ్డు వద్ద సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మర్రి రవీంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. మర్రి చెన్నారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే షేక్ గౌస్ దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మరణానంతరం 1997 వ సంవత్సరం నుంచి బేగంపేట ప్రకాశం నగర్ మెయిన్ రోడ్డు మీద మర్రి చెన్నారెడ్డి జ్ఞాపకార్థం తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి వేసవిలో పాదచారులకు తాగునీరు అందిస్తుంటారు ఏడాది కూడా మర్రి రవీంద్రారెడ్డి చేతులమీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మర్రి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి చెన్నారెడ్డి పేరుతో షేక్ గౌస్ చలివేంద్రాన్ని 28 సంవత్సరాలుగా నిర్వహిస్తూ పాదచారుల దాహార్తిని తీర్చుతుండటం అభినందనీయమన్నారు ప్రతి వేసవిలో బేగంపేటలో ఇలా చలివేంద్రం ఏర్పాటు చేయడం తమ కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హాజీ టోచర్, సిహెచ్ రాజేందర్, గౌర పల్లి రమేష్ ,అభిషేక్ అడపా, నసీరుద్దీన్ (అడ్డు) హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్ ,అల్తామాష్, పర్వేజ్ ,ఆలీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *