వేసవిలో తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సరఫరా వివరాలు, సమస్యలు అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. టంగుటూరు,పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…వేసవిలో తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఏ ఒక్క గ్రామంలో త్రాగునీటి సమస్య ఉండకూడదు. నీటి సరఫరాకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే అధికారులు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలి.
పొలాల్లో పశువులకు నీరందిoచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు.
