తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన మూలం రెడ్డి ప్రసాద్ రెడ్డి ఇటీవల వైసీపీని వీడి సెంట్రల్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ల సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా బిజెపిలో చేరిన తరువాత మంగళ వారం మొదటిసారిగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ను నరసరావుపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గౌతమ బుద్ధుని ప్రతిమ అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో కూటమిని బోలోపేతం చేసే విధంగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని మూలం రెడ్డి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
