కిషోర బాలికల వికాసానికి అధికారుల సమన్వయంతో
పనిచెయ్యాలని వక్తలు కోరారు. వెలుగు కార్యాలయంలో మంగళవారం కిషోర వికాసం పై అంగన్ వాడీ, మహిళా పోలీస్, ఆశ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
సీడీపీఓ సీహెచ్ భారతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీడీపీఓ సిహెచ్ భారతి మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఏర్పడి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని బాలిక విద్యను ప్రొత్సహించి, బాల్య వివాహాలు అరికట్టటమే లక్ష్యంగా పనిచెయ్యాలని కోరారు. కమిటీలో సభ్యుల బాధ్యతలను తెలిపారు. జిల్లా రిసోర్స్ పర్సన్ వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 11 నుండి 18 సంవత్సరములు ఉన్న బాలికలను గుర్తించి గ్రూపులుగా చేసి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య మాట్లాడుతూ పిల్లలకు చదవు కునే వయస్సులో అండగా నిలచి మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎపీఎం దేవ రాజ్ మాట్లాడుతూ పిల్లలకు డిఆర్డీఏ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. హెచ్ ఎస్ కోటేశ్వరి మాట్లాడుతూ బాలికల వ్యక్తి గత శుభ్రత, పౌష్టికాహార ప్రాముఖ్యత, ఆరోగ్య కరమైన జాగ్రత్తల గురించి తెలిపి చిన్నారులకు తెలిపాలని కోరారు. సూపర్ వైజర్ జ్యోతి మాట్లాడుతూ కిషోర బాలికల సమ్మర్ క్యాంపులు విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
