ప్రజల దాహార్తిని తీర్చేందుకు పంచాయితీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించటం అభినందనీయమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరు బస్టాండ్ కూడలిలో నాగయ్య కాంప్లెక్స్ వద్ద బుధవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. చల్లటి మినరల్ వాటర్, మజ్జిగ ను పంపిణీ చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి మేకల చార్లేస్ సర్జన్, ఎంపీడీఓ దార హనుమంత రావు,టిడిపి మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, టిడిపి నాయకులు మానం రమేష్, శాగం కొండా రెడ్డి, మేడగం వెంకటేశ్వర రెడ్డి, తూము శివ నాగి రెడ్డి, ఇడమకంటి వెంకేటేశ్వర రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, చందన, నాగార్జున రెడ్డి, వెంకట రెడ్డి, క్రిష్ణా రెడ్డి, రామయ్య, సుజాత, గ్రామకార్యదర్శి ఇడమకంటి వెంకట రమణా రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
