ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాహక్కు చట్టం
ప్రకారం ప్రభుత్వం 25శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించినట్లు మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావు లు తెలిపారు. ఈనెల 2 నుండి 15 వరకు విద్యార్థులు ప్రాధమిక వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు 2019 జూన్ రెండు నుండి మే 31 2020 మధ్య జన్మించి ఐదు సంవత్సరాలు నిండిన వారు అర్హలని చెప్పారు. అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు తమ ఆధార్, రేషన్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో కోరారు. మండలంలో మొత్తం 8 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయని, పాఠశాల నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
