ప్రతిభ చాటిన పీఎం శ్రీ కేంద్రీయ విద్యార్థులు

54వ క్షేత్రీయ క్రీడా ఉత్సములు -2025 రీజనల్ స్పోర్ట్స్ మీట్ లో ఒంగోలు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం గోల్కోండలో నిర్వహించిన పోటీలలో అథ్లెటిక్స్ విభాగంలో 12వ తరగతి కి చెందిన గీతా చరణ్ హామర్ త్రో లో వెండి పతకం, జావల్ త్రోలో అండర్ -19లో కాస్య పతకం సాధించారు. 11వ తరగతికి చెందిన బార్గవి జావలిన్ త్రోలో స్వర్ణ పతకం, అర్షిత 400 మీటర్ల పరుగు పందెంలో కాస్యపతకం సాధించినది. ఈసందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మనీష్ కుమార్ ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్స్ అందించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆతీష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *