ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాల ప్రయోజనాలను పొందడంపై అవగాహన కలిగి ఉండాలి -వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇంచార్జి అధికారి ఎం.టి. కష్ణబాబు

ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను తెలుసుకుని వాటి ప్రయోజనాలను పొందడంపై అవగాహన కలిగి ఉండాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇంచార్జి అధికారి ఎం.టి. కష్ణబాబు అన్నారు. గురువారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోస సామాజిక భద్రతా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు. లబ్దిదారులకు ఆయన స్వయంగా నగదు అందజేసి వారి కుటుంబ స్థితి గతులను, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి. పొందుతున్న సంక్షేమ పధకాల ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రాధమిక పాఠశాలలో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు పొందడంపై ప్రజలు అవగాహన కలిగి వుండాలన్నారు. ఆరోగ్యము, విద్య, స్వయం సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్, బి. పి ,షుగర్ తదితర రోగాలను గుర్తించేందుకు ఎన్ సి డి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ పొందుతున్న వారు ఆ డబ్బులను వైద్య ఖర్చులకు కాకుండా జీవన అవసరాలకు ఉపయోగించు కోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను, సంచార వైద్య వాహన (104), అంగన్ వాడి సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు . ఆరోగ్య, ఆశా, సిహెచ్ సి సిబ్బంది ద్వారా అందుతున్న సేవలపై ఈ సందర్భంగా ఆయన ఆరాతీసారు. జిల్లాలో పశుపోషణ, ఆక్వా కల్చర్, గనులు, తదితర రంగాలలో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, ప్రభుత్వ సహకారంతో ఎలా అభివృద్ధి పరచాలనే విషయం మీద కార్యాచరణ రూపొందించి తద్వారా ఆర్థికంగా ప్రజలు ఎదిగేలా చూడడం జరుగుతుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కలెక్టరు మాట్లాడుతూ… జిల్లాలో బంగారు బాల్యం, పోషణ్ పక్వాడా, పి-4 కార్యక్రమం, లక్ పతి దీది పధకాలు అమలు చేస్తున్న తీరును వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామానికి మెయిన్ తారు రోడ్డు వేయించానని, స్థానికులు కోరుకున్నట్లుగా తాగునీటి సరఫరాకు అవసరమైన పిల్టర్ బెడ్స్ ఏర్పాట్ల పై దృష్టి సారిస్తామని, కొత్తకోట వాగుపై బ్రిడ్జి నిర్మాణము, గ్రామానికి బస్సు సౌకర్యము, స్థానిక చెరువులో తామరాకు పూడికతీత పనులు చేపడతామని చెప్పారు.

అనంతరం గుళ్లపల్లి గ్రోత్ సెంటర్ ను తదుపరి గుండ్లకమ్మ రిజర్వాయర్ ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో సమావేశమయ్యారు. స్థానికేతరులు ఇక్కడ చేపలు పట్టకుండా చూడాలని, తాము చేపలు విక్రయించుకునేందుకు ఒక పెడ్డు లాంటి నిర్మాణం కావాలని మత్స్యకారులు కోరగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు కృష్ణబాబు చెప్పారు.

చివరిగా మద్దిపాడు పిహెచ్ సి ని తనిఖీ చేసారు. ఆసుపత్రిలో ఓపి రిజిస్ట్రేషన్, ల్యాబ్, ఫార్మసి, తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న సేవలపై కృష్ణ బాబు అరా తీసారు.

ఆయా కార్యక్రమాలలో వారి వెంట ఆర్డీవో లక్ష్మి ప్రసన్న, డిఆర్డిఏ పిడి నారాయణ, జడ్పీ సీఈవో
చిరంజీవి, డి ఎం హెచ్ ఓ వెంకటేశ్వర్లు, డి సి హెచ్ ఎస్ శ్రీనివాస నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి సిహెచ్. శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ . ఈ బాల శంకర రావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *