ప్రజల ఆకాంక్షలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడంపై అన్ని శాఖలు మరింత దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇంచార్జి అధికారి శ్రీ.ఎం.టి. కష్ణబాబు పిలుపునిచ్చారు. గురువారం ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినఅభివృద్ధి, సంక్షేమ పధకాలు జిల్లాలో అమలవుతున్న తీరు, వాటి పురోగతిపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. ఆయా శాఖల వారీగా సాధించిన పురోగతిని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టరు ఆర్. గోపాల కృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక పెన్షన్ లు వికలాంగ పెన్షన్ ల వెరిఫికేషన్; దీపం – 2; సోలార్ విద్యుత్; రక్షిత మంచినీటి సరఫరా – వేసవిలో ఎదురయ్యే సవాళ్లు – పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు: పి-4 అమలు; మీ కోసం అర్జీలు – రీ ఓపెన్ కేసుల; ఆడిట్; రిసర్వే -పైలెట్, ఫేజ్ – 2 పురోగతి; హౌసింగ్; ఉపాధి హామీ పధకాల పై ఈ సమావేశంలో ప్రధానంగా ఆయన చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సరఫరా చేయడంతోపాటు నీటి నాణ్యత కూడా ముఖ్యమని చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆర్ధికంగా స్థిరపడిన వారి వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకుంటే “మార్గదర్శకులుగా గుర్తించి “బంగారు కుటుంబా”లకు అండగా ఉండేలా చూడవచ్చని సూచించారు. ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన పల్లె పండుగ పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం నుంచి విడుదల అయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా అయన చెప్పారు. జిల్లా జి.డి. పి 15 శాతం ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ లో కలెక్టరు చెప్పినందున ఆ దిశగా అన్ని శాఖలు దృష్టి సారించాలని కృష్ణ బాబు దిశా నిర్దేశం చేసారు. అభివృద్ధి, ర్యాంకుల విషయంలో జిల్లాలు పోటీ పడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, ప్రకాశం జిల్లాను మెరుగైన స్థానం లో నిలపాల్సిన భాద్యత అన్ని శాఖలపైనా ఉందన్నారు. ఈ దిశగా బలం, బలహీనతలను గుర్తెరిగి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అయన సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం జిల్లా ఆర్దిక అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు.
ఈ సమావేశం లో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టరు సహదిత్ వెంకట త్రివినాగ్ , సిపిఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


