గుండ్ల పోచంపల్లి మే 1(జే ఎస్ డి ఎం న్యూస్)
జాతీయస్థాయిలో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలపై డాక్టర్ జి సంజీవరెడ్డి నాయకత్వంలో కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రం ఐ ఎన్ టి యు సి నాయకులు కావేరి శేఖర్ ముదిరాజ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా అప్పరల్ ఎక్స్పోర్ట్ పార్క్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మినీ ట్యాంక్బండ్ వద్ద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు కావేరి శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఎన్ టి యుసి జెండా ఎగరవేసి సంఘటిత అసంఘటిత కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం సంక్షేమం కోసం జాతీయ ఐ ఎన్ టి యు సి నాయకులు డాక్టర్ జి సంజీవరెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు డిజిటల్ ఇండియా స్టార్ట్ అఫ్ ఇండియా స్టాండప్ ఇండియాలో దేశంలో యువకులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. ఈజీ డూయింగ్ జాబుల పేరుతో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వం పై తిరుగుబాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గౌడవెల్లి మాజీ సర్పంచ్ గరిసె సురేందర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రం ఐ ఎన్ టి యు సి కార్యదర్శి అమరం సురేష్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ఓబీసీ సెల్ చైర్మన్ బట్టి కార్డు విజయకుమార్ ముదిరాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొడ్ల మోహన్ ముదిరాజ్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదిలక్ష్మి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళ నాయకురాలు మరియమ్మ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ పాండు మల్లేష్ మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

