ప్రజల పక్షమే సాక్షి యుద్ధం – పత్రికా స్వేచ్ఛపై దాడిని ముక్త కంఠంతో ఖడించిన జర్నలిస్ట్ లు -సాక్షి ఎడిటర్ నివాసంపై పోలీసుల దాడి ని దుయ్య బడ్డిన జర్నలిస్ట్ నాయకులు

ప్రజల గొంతుకై నిలిచే పత్రికలపై కక్ష్య సాధింపు ప్రభుత్వాలకు తగదని జర్నలిస్ట్లు ముక్త కంఠంతో ఖడించారు. ఒంగోలు పట్టణంలో జర్నలిస్ట్ లు, జర్నలిస్ట్ సంఘ నాయకులు ఒంగోలు సాక్షి ప్రాంతీయ కార్యాలయం నుండి, ఎస్పీ కార్యాలయం , కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పత్రికా స్వేచ్చను హరించటం తగదని నినాదాలు చేసారు. రైతుల, ప్రజల, ఉద్యోగుల, కార్మికులు, శ్రామికుల పక్షాన నిలుస్తూ నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షిని ఎలాగైనా నిలువరించాలన్న దురుద్దేశ్యంతో ప్రభుత్వం లేని పోని అవాస్తవాలతో సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసం పై ఎటువంటి నోటీసులు లేకుండా ఎక పక్షంగా దాడులు చేసారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖడించండి… సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి సిగ్గు… సిగ్గు… ప్రజల పక్షమే సాక్షి యుద్ధం…., పత్రికా స్వేచ్ఛపై దాడి మేధావులారా బడించండి. పత్రికా స్వేచ్ఛకు సంకేళ్లు ప్రజాస్వామ్యానికి తూట్లు. భయ పెట్టి నిజాలను అడ్డు కోలేరు …. ప్రజల పక్షమే సాక్షి యుద్ధం, ప్రశ్నించే గొంతు నొక్కితే ఖబద్ధార్ .. ఖబర్ధార్ … ఖాకీలను అడ్డు పెట్టి జర్నిలిజాన్ని నియంత్రించ లేరు… అంటూ ప్లే కార్డులు పట్టి నినదించారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, డిఆర్ఓ చిన ఓబులేసు లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎపీయూడబ్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ సురేష్, సాక్షి బీఎం శివన్నారాయణ సాక్షి బ్యూరో ఇన్చార్జి ఎన్ మాధవ రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి రవిచంద్ర, సీనియర్ సబ్ ఎడిటర్ ప్రమోద్, సబ్ ఎడిటర్లు రాజశేఖర్, నాగార్జున రెడ్డి, ప్రసాద్, జనార్ధన్, సుందరం, గంగాధర్ ఎసీఎం పవన్ కుమార్, ఒంగోలు ఆర్సీ ఇన్చార్జి శ్రీనివాస రావు, సీనియర్ రిపోర్టర్ లు మాల్యాద్రి సయ్యద్ సాబీర్ హుస్సేన్, నాని . సుబ్బా రెడ్డి, ఎం రామాంజనేయ రెడ్డి , శ్రీనివాస రావు, మధు, వెంకట రావు, రాకేష్, నిరీక్షణ్, సాయి క్రిష్ణ, సురేష్ యాడ్స్ విభాగం శర్మ, బాస్కర్ రెడ్డి, అకౌంట్స్ విభాగం సిబ్బంది, పలువురు సీనియర్ రిపోర్టర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *