సుఖ వ్యాధుల పట్ల అవగాహనతో ఉండాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. లక్కవరంలో గురువారం చైల్డ్ ఫండ్ సంస్థ లింక్ వర్కర్ స్కీము ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్, క్షయ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్ఐవీ అంటు వ్యాధి కాదని వ్యాధి నిర్ధారణ అయినట్లతే తగిన మందులు క్రమం తప్పకుండా వాడాలని చెప్పారు. ఎల్ డబ్యు సూపర్ వైజర్ భాస్కర్ మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తతో పాటు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సమీప పీహెచ్సీ లలో ప్రాధమిక నిర్ధారణ అనంతరం మందులు వాడుకోవాలని చెప్పారు. ఎల్ డబ్యు సుబ్బా రావు, స్థానిక నాయకులు . ఆరోగ్య,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
