డీఎస్సీ వ్రాస్తున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో క్రాస్ కోర్సు ప్రత్యేక పద్ధతులతో బోధనను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు జి అర్చన తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులు, దృష్టి, వినికిడి, అంగ వైకల్యం 40శాతం పైగా కలిగి, టెట్ పరీక్షలో పొందిన మార్కుల అధారంగా ఎంపిక ఉంటుందని చెప్పారు. ఈనెల 11 నుండి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామని చెప్పారు. శిక్షణ సమయంలో బోజన, వసతి ఉచితంగా కల్పించబడునని, మెటీరియల్ కూడ ఉచితంగా అంద చేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలో డీఎస్సీని సన్నద్ధం అవుతున్న దివ్యాంగ విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
డీఎస్సీ దివ్యాంగ అభ్యర్థులకు క్రాష్ కోర్సు
08
May