మూడు మండలాలకు చెందిన 60 గ్రామాల ప్రజల రైతాంగ విద్యుత్తు లోవోల్టేజీ సమస్య పరిష్కారం కోసం నిర్మిస్తున్న 132/33 కేవీ విద్యుత్తు సబస్టేషన్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయాలని జాయిం ట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురం గ్రామ శివారున సబ్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని, బెల్లంకొండవారిపాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను, తూర్పుగంగవరం గ్రామంలోని మల్లిఖార్జున రైస్ మిల్లును జేసీ గురువారం పరిశీలించారు. శివరాంపురం గ్రామశివారున తూర్పుగంగవరం- చీమకుర్తి వెళ్లే మార్గంలో శివరాంపురం గ్రామ సర్వే నంబర్లు 307/3లో 0.51సెంట్లు, 307/5లొ 3.13 ఎకరాలు మొత్తం 5.64 ఎకరాలు కేటాయిం చారు.గత టీడీపీ ప్రభుత్వంలో 2018లో నిధులు మంజూరయినా నిర్మాణ పనులు చేపట్టలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రైతాంగ, ప్రజలు పడుతున్నలోవోల్టేజీ సమస్యపరిష్కారానికి విద్యుత్తుసబ్ స్టేషన్ మంజూరు చేసిందని, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించటం జరిగిందనిజేసీ తెలిపారు. విద్యుత్తు శాఖా అధికారుల పర్యవేక్షణలో గడువుకు ఒకరోజు ఆగస్టు మాసం చివరికి పూర్తి చేయాలని కంటాక్టర్ కు
జేసీ సూచించారు. ఈసబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మూడు మండలాలకు చెందిన 60 గ్రామాల రైతుల ప్రజల విద్యుత్తు కష్టాలు తొలు గుతాయని జేసీ తెలిపారు. శివరాంపురం గ్రామసర్వే నంబర్లో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మిస్తూ తూర్పుగంగవరం సబ్స్టేషన్గా మంజూరు చేయటం పట్ల ఆ గ్రామానికి చెందిన మన్నం రామకోటయ్య, మారిశెట్టి హనుమంతరావు తదితరులు జేసీ దృస్టికి తీసుక వచ్చారు. ఈవిషయమై జేసీ విద్యుత్తు అధికారులతో మాట్లా డగా గత టీడీపీ ప్రభుత్వం 2018లో తూర్పుగంగవరం వద్ద మంజూరు చేయగా
తదుపరి ప్రభుత్వం శివరాంపురం వద్ద స్థలాన్ని సమీకరించి నిర్మాణం చేపట్టారని జేసీకి విన్నవించారు. శివరాంపురం గ్రామస్తుల విన్నపం మేరకు ఆగ్రామ పేరును కూడా విద్యుత్తు సబ్జెస్టేషన్ పెట్టేలా సంబందిత అధికారులతో మాట్లాడతానని జేసీ గ్రామస్తులకు హమీ ఇచ్చారు. బెల్లంకొండవారిపాలెం గ్రామ వద్ద జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. రికార్డుల్లో వున్న గ్రామ విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమిసరిపోయిందా ? లేదా ? అడిగి తెలుసుకున్నారు. రైతులను పిలిచి వారి స మక్షంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే జరపాలన్నారు. ముందుగా ప్రభుత్వ భూములను కొలిచి తదుపరి పట్టా భూములను కొలిచి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవన్నారు. తూర్పుగంగవరం
గ్రామ శివారున గల మల్లిఖార్జున రైస్ మిల్లును తనిఖీ చేశారు.మిల్లులోని బస్తాల్లో వున్న బియ్యాన్ని పరిశీలించారు. రేషన్ బియ్యంను తీసుక వచ్చి మిల్లర్ చేస్తున్నారా అన్న విషయంమై పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. మిల్లర్ వేసి అమ్మకానికి సిద్ధం చేసిన బియ్యం బస్తాలోని బియ్యాన్ని పరిశీలించి ఆబియ్యం శ్యాంపిల్స్ ను
పరిశీలనకు పంపాలని తహసీల్దార్ ను ఆదేశించారు.
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తక్షణమే తొలగించాలి- జేసీ ఆదేశం
132/33 కేవీ సబ్ స్టేషన్ ఆనుకుని వున్న పశువుల మేత పోరం బోకు భూమిలో సం చారజాతుల వారుతాత్కాలిక పూరిగుడిసెలు వేసుకుని ఆక్రమించుకున్నారని శివ రాంపురం గ్రామస్తులు జేసీ గోపాలకృష్ణ దృష్టికి తీసుక వెళ్లారు. దీనిపైజేసీ స్పందించి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఉపేక్షించేదిలేదని తక్షణమే ఖాలీ చేయించాలని తహసీల్దార్ సంజీవరావు, విఆర్వో చంద్రశేఖర్రావులను ఆదేశించారు. ఆస్థలంలోని ఆక్రమణలను10 రోజుల్లో ఖాలీ చేయించకుంటే సంబందిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాధు అందజేయాలని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.సంజీవరావు, మండల సర్వేయర్ శ్రీనివాసరావు,విద్యుత్తు శాఖ కన్స్ట్రక్షన్ ఈఈ కృష్ణారెడ్డి, ఏడీఈ రామాంజనేయులు, విఆర్వో పి.చంద్రశేఖర్ రావు, తదితరులు పాల్గొన్నారు.


