వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శిఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తాళ్లూరు మండ లంలోని తూర్పు గంగవరం గ్రామానికి చెందిన దర్శి నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు జక్కుల రామకృష్ణను పరామర్శించారు. ఆయన ఇటీవల కాలుకు ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అతడిని గురువారం పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు యాడిక యలమందారెడ్డి సతీమణి సుబ్బారత్నం దశ దిన కర్మకు హాజరై ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని ధైర్యం నింపారు. ప్రజా ప్రతినిధులు ,పార్టీ మండల, జిల్లా గ్రామ బాధ్యులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

