కాశీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రహరి సిబ్బంది నివాసాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే……..

కంటోన్మెంట్ మే 9 (జేఎస్డిఎం న్యూస్):
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని. వార్డు 2 శ్రీ కాశీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్మించనున్న ప్రహారి గోడ మరియు సిబ్బంది నివాసాల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం భూమి పూజ చేశారు.
ఈ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు స్థానిక ఎమ్మెల్యే గా అన్ని విధాల సహకరిస్తామని అన్నారు. అలాగే స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని స్వామి వారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం తో పాటు, తీర్దప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *