పాకిస్థాన్ యుద్ధంలో ఆర్మీ జవాన్లకు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు…….

సికింద్రాబాద్ మే 9(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత్ శత్రుదేశం పాకిస్థాన్ పై చేస్తున్న యుద్ధంలో మన ఆర్మీ జవాన్లకు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సికింద్రాబాద్ లో ఉన్న చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయం లో శుక్రవారం ఉదయం బీజేపీ నేతలు పూజలు చేశారు.మహాంకాళీ ఆలయంలో ఈవో మనోహర్ రేడ్డి ఆధ్వర్యంలో,ఆలయం చైర్మన్ సురిటీ రమేష్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్,ఎస్.ఆర్.మల్లేష్, డాక్టర్ శివకుమార్,,రామ్ గోపాల్ పేట డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్,నీతీష్ బోలె, శ్రీనివాస్ యాదవ్,శ్రీధర్,ఎస్.ప్రవీన్,నరేందర్ పాల్,గోపికిషన్ ఉపాధ్యాయ,ధన్ రాజ్ తదితరులు ఈ పూజా కార్యక్రమాలులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహాంకాళీ ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ అమ్మవారికి కుంకుమార్చనతో పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ మాట్లాడుతూ శత్రు దేశం తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆర్మీ జవాన్లు ధైర్య సాహసాలు చేస్తు దూసుకెళుతున్న తరుణంలో మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని తామందరం కోరుతున్నామని వివరించారు.
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీనేతృత్వంలోజరుగుతున్న ఆపరేషన్ సింధూర్ లో విజయకేతనం ఎగురవేస్తారని కేవలం మన దేశం లోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉగ్రవాదులు కార్యకలపాలను రూపురేఖలు లేకుండా చేయాలని, భావిస్తున్నామని ఆయన  అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *