హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ జనతా కి కహాని మేరి ఆత్మకథ.పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్.

న్యూఢిల్లీ మే 9 (జే ఎస్ డి ఎం న్యూస్ ఢిల్లీ ప్రతినిధి)
ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ హిందీ అనువాదం ‘జనతాకీ కహానీ, మేరీ ఆత్మకథ’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో. బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్ ఖట్టర్, జి.కిషన్ రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తో పాటుగా.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్ది మాట్లాడుతూ
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ‘జనతాకీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వారికి తెలుగు ప్రజల తరఫున అభినందనలుతెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో.. కుల,మతాలకు అతీతంగా అందరూ దత్తాత్రేయ ని అభిమానిస్తారు. ఆర్ ఎస్ ఎస్ తో ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. బీజేపీలో వివిధ బాధ్యతలను నిర్వర్తించి.ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ఇవాళ గవర్నర్‌గా అంచెలంచెలుగా ఎదిగిన వారి జీవితం స్ఫూర్తిదాయకం.అన్నారు.
మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజపేయి నేతృత్వంలో కేంద్రమంత్రిగా బండారు దత్తాత్రేయ పని చేశారు. ఆ తర్వాత మోదీ కేబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. దత్తాత్రేయ జీవితం యువ రాజకీయ నాయకులకు ప్రేరణ. నా రాజకీయ జీవితం కూడా దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆయన 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నేను ఇప్పుడు ఎంపీగా ఉన్నాను. చేయిపట్టుకుని రాజకీయాలు నేర్పించారు. ఇది నాకు గర్వకారణం.సేవాభారతి ద్వారా.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మురికివాడల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఎమర్జెన్సీ సమయంలోనూ.. ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్నారు. కానీ ఏనాడూ తన సిద్ధాంతాన్ని వీడలేదు.
వారి జీవితంలోని వివిధ దశల్లో గడించిన అపార అనుభవాన్ని పుస్తకరూపంలోకి తీసుకురావడం నిజంగా అభినందనీయం. దత్తాత్రేయ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ కేవలం రాజకీయ నాయకులకే కాదు.. దేశ యువతకు ఆదర్శం. యువత ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బండారు దత్తాత్రేయ నిబద్ధత అంకిత భావాన్ని కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *