ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతితో పాటు లేబర్ మొబిలైజేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియామండల ప్రత్యేక అధికారులను, ఎంపీడీవోలను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, డ్వామా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రభుత్వం ఫారం పాండ్స్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫారం పాండ్స్ నిర్మాణాలను పుర్తిచేయాలన్నారు. మే మాసాన్ని ఫారం పాండ్స్ మాసంగా ప్రకటించడం జరిగిందని, ఈ మాసంలో 1680 ఫారం పాండ్స్ నిర్మాణాలు పూర్తీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫారం పాండ్స్ నిర్మాణాలను పూర్తీ చేసేలా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లేబర్ మొబిలైజేషన్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు కూలీలకు రోజువారి సగటు వేతనం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. లేబర్ మొబిలైజేషన్ లో కొనకనమిట్ల, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, వెలిగండ్ల మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి వున్నాయని, సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు లేబర్ మొబిలైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 1,376 పశువుల నీటి తోట్టెల నిర్మాణాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1080 నిర్మాణాలు పూర్తీ చేయడం జరిగిందని, మిగిలినవి రెండు రోజుల్లో పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి జోసెఫ్ కుమార్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు, ఏపిడిలు, ఏపిఓలు తదితరులు పాల్గొన్నారు.

