శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా మరియు అంతర్గత భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు ఎక్కువగా సంచరించే, నిరంతరం రద్దీగా ఉండే ప్రదేశాలలో పోలీస్ అధికారులు, సిబ్బంది, బీడీ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో స్పెషల్ డ్రైవ్ లో జిల్లా అంతటా విస్తృతంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ లు, బార్డర్ చెక్పోస్టులు ఇలా అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించారు.
జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజల యొక్క భద్రత మరియు రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఆకస్మిక తనిఖీల నిర్వహణ అనేది నేరాలను అదుపులో ఉంచడానికి మరియు ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నామని భరోసా ప్రజలకు కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడానికి తనిఖీలు మరింత పటిష్ట పరచడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని ప్రజలు ప్రశాంతం ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు.
ఒకవైపు వాహనాలు తనిఖీ చేస్తూనే పోలీసులు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు గురించి తెలియచేస్తున్నారు. ఏమైనా అనుమానస్పదంగా బ్యాగులు, వ్యక్తులు మరియు ఇతర వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 సమాచారం అందించాలని పోలీస్ అధికారులు తెలియజేశారు.


