బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గత నెల 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో మరణించిన మన భరతమాత ముద్దుబిడ్డల ఆత్మశాంతికీ, మనపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు మన దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సారధ్యంలో “అపరేషన్ సింధూర్” పేరిట పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై విరోచిత దాడులు చేసి వందమంది ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది. ఇందుకుగాను మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలకు మరియు మన దేశ రక్షణ వ్యవస్థకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండల దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని కోరుచున్నాము.
ఈ కార్యక్రమం ను జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నానని బిజేపి ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు విజ్ఞప్తి చేశారు.