అవమానం జరిగిన చోటే తన సత్తా చాటి చెప్పిన సాధారణ పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ లో ఎంపికయి ఐ పి ఎస్ కొట్టడం తో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ల పాలెం గ్రామ పౌరులు తమ బిడ్డ మూలగానికి ఘనంగా పౌర స్వాగతం పలికారు. తీర ప్రాంతంలో అరకొర చదువులు అందే ప్రాంతం లో జాతీయ స్థాయి పోటీ పరీక్షల లో తన సత్తా చాటాడు మూలగాని ఉదయ కృష్ణా రెడ్డి. ప్రజలకు తనవంతు సేవలు అందించాలనిన లక్ష్యంతో చిన్న పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయి సమాజానికి సేవలు అందిస్తున్న ఉదయ కృష్ణా రెడ్డి కి తన పోలీస్ ఉన్నత అధికారుల నుండి వేధింపులు, ఎగతాళి అవమానం మానసికంగా కంగా కంగా తీశాయి. దానితో కసి పెంచుకున్న ఉదయ కృష్ణా రెడ్డి నూరు ఆరయినా అవమానం పొందిన దగ్గరే సత్తా చాటాలని గ్రామం నుండి పట్టణ బాట పట్టారు. నిరంతరం కఠోర శ్రమ సాధన చేసి తన సత్తా చాటి సివిల్స్ పరీక్షలో ఐ పీఎస్ సాధించడం గ్రామ ప్రజలతో పాటు ఉదయ కృష్ణా రెడ్డి పట్టలేని ఆనందం తో సింగరాయకొండ నుండి ఊళ్ల పాలెం వరకు పౌర ర్యాలీ లో పాల్గొన్నారు. తమ గ్రామ యువకుడు ఐ పి ఎస్ కి ఎంపిక కావడం తో ఊళ్ల పాలెం, బంగిన పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు తారతమ్యం లేకుండా పండుగ చేసుకున్నారు. దీక్ష పట్టుదల కసి నిబ్బరం ఉంటే ఉన్నత స్థాయి కి వెళ్ళవచ్చని ఉదయ కృష్ణారెడ్డి నిరూపించడం స్థానిక ప్రజలు ఆయన బంధువులు, స్నేహితులు పేర్కొన్నారు. సంపాదన అంటే డబ్బు కాదు చదువు అని ప్రతి ఒక్కరు గుర్తించి ఉదయ కృష్ణారెడ్డి ని ఆదర్శంగా తీసుకుని పిల్లలని బాగా చదివించాలని, పిల్లకూడ ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తల్లిదండ్రులు, పెద్దలు పిలుపు ఇచ్చారు. మార్గ మద్యంలో సింగరాయకొండ పోలీసు సిబ్బంది ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు.


