జిల్లాలో నేరాలు నియంత్రణ, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ శిక్షణ అనంతరం ఒంగోలు పట్టణం లో 50 ప్రదేశాలలో పోలీసు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో, రహదారులపై వాహనాలు, శివారు ప్రాంతాలలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.
ఈ తనిఖీలో రికార్డులు సరిగా లేని పలు మోటార్ సైకిల్ మరియు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్న వాటిని సంబంధిత పోలీసు స్టేషన్ లకు తరలించారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించామని, చట్ట వ్యతిరేక పనులకు, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100/112 తెలియజేయాలని అక్కడి ప్రజలను కోరారు.
ఈ తనిఖీలో డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు నాగరాజు,శ్రీనివాసరావు,అజయ్ కుమార్, సుబ్బారావు, బీమా నాయక్, అస్సన్, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, జగదీష్, పాండురంగారావు, మల్లికార్జున, రామకోటయ్య, సురేష్, ప్రభాకర్, రామారావు, సోమశేఖర్, శ్రీనివాసరావు, సమ్మిముల్లా, హాజరత్తయ్య, ఖాజావలి, సుబ్బారావు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


