దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బర్తడే వేడుకలు శనివారం రాత్రి విజయవాడలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు ఇన్చార్జిల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో కేక్ కట్ చేసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో యువనాయకత్వం అవసరమని మహిళ నాయకురాలుగా ఒక డాక్టర్ గా రాబోయే తరానికి పార్టీలో యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పెద్దలు కొనియాడారు. డాక్టర్ లక్ష్మీ బర్త్ డే వేడుకల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇన్చార్జులు.. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు , ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్ తదితర నాయకులు ఉన్నారు.



